మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉన్న కార్డులు రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు వాటి స్థానలో చిప్ ఉన్న కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు ఇప్పటికే బ్యాంక్ సిబ్బంది అందరికి అందించింది. ప్రస్తుతం చిప్ కార్డులు తరహాలో కొత్తగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ కార్డులు వచ్చాయి.వీటివల్ల మనకి చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే.. ప్రస్తుతం మనం ఎక్కడైనా షాపింగ్ చేస్తే డబ్బులు ఇవ్వకుండా కార్డు ద్వారా పే చేస్తాం.కార్డు ద్వారా పేమెంట్ చెయ్యాలంటే ముందుగా కార్డు స్వైప్ చేసి ఆ తరువాత పిన్ నమోదు చేసి ఇస్తే అప్పుడు పేమెంట్ అవుతుంది.ఈ కార్డు ఉన్నవాళ్ళు అంత సమయం వెచ్చించకుండా ఈ కార్డు ఉపయోగపడుతుంది.ఈ కార్డు మాములుగా ఒకసారి స్కాన్ చేస్తే సరిపోతుంది వెంటనే డబ్బులు కట్ అవుతాయి.అయితే ప్రస్తుతం ఇవి 2000 రూపాయలు వరకు మాత్రమే పరిమితి ఇవ్వడం జరిగింది.రానున్న రోజుల్లో అది పెరిగే అవకాశం కూడా ఉంది.దీనివల్ల ఎక్కువ సమయం కూడా ఉండాల్సిన అవసరం ఉండదు.అంతేకాకుండా సెక్యూరిటీ గా కూడా ఉంటుంది.
