కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి విజ్ఞప్తి జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు.. తమ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని స్పీకర్‌కు ఇచ్చారు.స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు.గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి 12 మంది ఎమ్మెల్యేలం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమ నిర్ణయాన్ని కూడా ప్రజలు సంపూర్ణంగా ఆమోదించారని ఆయన తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో 12 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజుర్‌నగర్ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.
