టీమిండియా ప్రధాన కోచ్ విషయం ఒక కొలిక్కి వచ్చేసిందనే చెప్పాలి ఎందుకంటే ఈ విషయాన్నీ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా చివరికి ఆరుగురు ఫైనల్ లిస్టులోకి చేరారని వారికి ఈ శుక్రవారం ఇంటర్వ్యూ ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆయా వ్యక్తులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగిందని కపిల్ అన్నారు. దీనికి నేరుగా రాలేని వారు స్కైప్ ద్వారా అటెండ్ అవ్వొచ్చని కమిటీ తెలిపింది. ఇక ఆ ఆరుగురు విషయానికి వస్తే టామ్ మూడీ, మైక్ హెసన్, ఫిల్ సిమన్స్, రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్ లతో పాటు ప్రస్తుత టీమ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం రవిశాస్త్రి విండీస్ టూర్ లో ఉన్నాడు కాబట్టి అతడు స్కైప్ ద్వారా ఇంటర్వ్యూ కు హాజరు కానున్నాడు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన మద్దతు ప్రస్తుత కోచ్ కే ఇచ్చిన విషయం తెలిసిందే.కాని బీసీసీఐ మాత్రం ఎవరి మద్దతు స్వీకరించబోమని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఏదోక రాజకీయం జరుగుతుందనే అనుమానమైతే ఉందని అంటున్నారు.
