హైదరాబాద్ లో డెంగీ మహమ్మారి వీరవిహారం చేస్తుంది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలి. నగరంలో అన్ని ప్రాంతాల్లో రోజు దోమలు మందు కొట్టాలి. అంతేకాకుండా జీఎచ్ఎంసీ అధికారులు మురుగు నీటిలో దోమలు పెరగకుండా చూసుకోవాలి. నగరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జీహెచ్‌ఎంసీతో కలిసి దోమల నివారణ, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి. ఈ వ్యాధికి సంబంధించి అన్ని ఆశుపత్రుల్లో మెడిసిన్ ఏర్పాటు చెయ్యాలి. ఇలా చేయడం వల్ల కొంతవరకు నివారణ జరగవొచ్చు.
