Home / INTERNATIONAL / రేవంత్ ఇజ్జ‌త్ మొత్తం తీసేసిన అమెరిక‌న్లు..!

రేవంత్ ఇజ్జ‌త్ మొత్తం తీసేసిన అమెరిక‌న్లు..!

తాను పులిబిడ్డ‌న‌ని…తెలంగాణ ఫైర్  బ్రాండ్ నేత‌న‌ని త‌న‌ది తాను డ‌బ్బా కొట్టుకునే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి…వ‌రుస‌గా అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు. ఇటు పార్టీలో నేత‌ల స‌హ‌కారం లేక‌…పైగా ఫిర్యాదులు చేస్తూ ఇబ్బంది ప‌డుతున్న రేవంత్‌కు…అటు ఆద‌ర‌ణ విష‌యంలోనూ అదే రీతిలో ప‌రేషాన్ అవుతున్నార‌ని అంటున్నారు. తాజాగా అమెరికాలో ఆయ‌న‌కు ఎదురైన అవ‌మానం నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన రేవంత్ రెడ్డికి న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో ఒకింత షాక్ త‌గిలింద‌ని అంటున్నారు. రేవంత్‌కు స్వాగ‌తం చెప్పేందుకు పట్టుమని పదిమంది కూడా అమెరికాలోని ప్రవాస భారతీయులు రాలేదు. దీంతో వ‌చ్చిన‌వారితోనే…రేవంత్ క‌లిసి వెళ్లిపోయారు. కాగా…త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఓడిపోయిన నేత‌కు ఇంత‌కంటే ఆద‌ర‌ణ ఎలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.