మూడు టీ20లలో భాగంగా ఆదివారం తిరువనంతపురం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. చివరికి వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. అయితే కేరళ అంటే ప్రస్తుతం అందరికి గుర్తొచ్చేది సంజు శాంసన్. ఎందుకంటే ఈ ఆటగాడు కేరళ వాసుడు. తన అద్భుతమైన ఆటతో తన రాష్ట్రానికే మంచి పేరు తెచ్చాడు. అలాంటి ప్లేయర్ శిఖర్ ధావన్ ప్లేస్ లో జట్టులోకి వచ్చాడు. అయితే మొదటి మ్యాచ్ లో అవకాశం రాలేదు. రెండో మ్యాచ్ లో ఐనా అవకాశం వస్తుందని అందరూ భావించారు. ఎందుకంటే అది అతడి హోంగ్రౌండ్ కాబట్టి, మరోపక్క పంత్ ఆట కూడా అంతంత మాత్రమే ఉండడంతో అతడి స్థానంలో తీసుకుంటారని భావించారు. కేరళ అభిమానులు కూడా అందుకే ఎక్కువగా వచ్చారని తెలిసింది. కాని చివరికి మాత్రం అతడి మొండిచెయ్యి చూపించారు.
