ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నవారిలో భారత క్రికెట్ సారధి విరాట్ కోహ్లి ఒకడని చెప్పాలి. తన ఆటతో కెప్టెన్సీతో అభిమానులను అమాంతం పెంచుకున్నాడు. ప్రస్తుతం సంపాదన పరంగా భారత్ మాజీ కెప్టెన్ ధోనిని మించిపోయాడు. ఇక అసలు విషయానికి వస్తే తమ ట్వీట్ లతో భారీగా డబ్బులు సంపాదించే వ్యక్తులతో టాప్ 5 లో కోహ్లి చేరాడు. ఈ జాబితాలో క్రికెటర్స్ లో కోహ్లి ఒక్కడే ఉన్నాడు. అతడి ట్వీట్ కు 2.5కోట్లు సంపాదిస్తాడు. ఇక మొదటి స్థానంలో రొనాల్డో 6కోట్లు తో ఉన్నాడు.
