బీ అలెర్ట్.. తెలంగాణలో తొలి కరోనా మరణం.. !
shyam
March 28, 2020
TELANGANA
632 Views
రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో వణికిపోతున్న తెలంగాణ ప్రజలకు మరో షాకింగ్ న్యూస్తె. తెలంగాణ లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా వైరస్ బారిన పడి తెలంగాణ వ్యక్తి ఒకరు చనిపోయారు. ఖైరతాబాద్‌కు చెందిన 74 సంవత్సరాల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజుల క్రితం ఓ ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి చనిపోయాడని, అయితే, ఆయన మరణించిన తర్వాత రిపోర్టులు వచ్చాయని, అయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని మంత్రి పేర్కొన్నారు. ఇక తెలంగాణలో ఈరోజు కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఈటల రాజేందర్ తెలిపారు. ఈనెల 27 వరకు 59 మంది కరోనా పాజిటివ్ బాధితులు ఉండగా, ఈరోజు కొత్తగా మరో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 65కు పెరిగింది. కాగా ఇవాళ నమోదైన ఆరు కేసుల్లో ఒకే కుటుంబానికి ఐదుగురికి పాజిటివ్ రావడం గమనార్హం.
Post Views: 238