రైతు హితమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ గారు పని చేస్తున్నారని పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు ..గజ్వేల్ లో జరిగిన ఆత్మ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారితో కలిసి ఎంపి గారు పాల్గొన్నారు..
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాతనే సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రైతు సంక్షేమం కొనసాగుతుందన్నారు.. రైతుబంధు రైతు బీమా, 24 గంటల కరెంటు, ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా తీసుకెళ్లడానికి సీఎం కేసీఆర్ గారు బి ఆర్ ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ..
దేశవ్యాప్తంగా తెలంగాణ నమూనాగా అభివృద్ధి సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందన్నారు .ఆత్మ కమిటీ పాలకవర్గం కు ఆయన శుభాకాంక్షలు చేశారు.. రైతులకు అందుబాటులో ఉండి రైతులకు సలహాలు సూచనలు అందించాలని ఆయన కోరారు..అనంతరం గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారితో కలిసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ సందర్భంగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు