తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని నిమ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సమ్మెలు నిషేధిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నేటి నుండి ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధించారు. ఎస్మా చట్టం ప్రకారం సమ్మెలను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అత్యవర వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా, ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.