తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు మంగళవారం వేములవాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి మంత్రి కేటీఆర్ రూ. 72 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.
రూ. 20 కోట్లతో చేపట్టనున్న పట్టణ రహదారులు, స్టేడియం, సినారె కళామందిరం పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అలాగే రూ. 52 కోట్లతో రహదారుల పునరుద్ధరణ పనుల శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత రుద్రంగిలో 3.50 కోట్లతో నిర్మించిన కస్తూర్బా స్కూల్ భవనాన్ని ప్రారంభించారు.