Home / SLIDER / బీఆర్ఎస్‌లో చేర‌నున్న ఒడిశా మాజీ సీఎం

బీఆర్ఎస్‌లో చేర‌నున్న ఒడిశా మాజీ సీఎం

ఒడిశా మాజీ ముఖ్య‌మంత్రి గిరిధ‌ర్ గ‌మాంగ్ ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీలో చేర‌నున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ కండువా క‌ప్పుకోనున్నారు. గిరిధ‌ర్ గ‌మాంగ్‌తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి శివ‌రాజ్ పాంగి, ఇత‌ర నాయ‌కులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

గిరిధ‌ర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కుమారుడు శిశిర్ గ‌మాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను గిరిధ‌ర్ గ‌మాంగ్ త‌న కుమారుడు క‌లిసిన‌ సంగ‌తి తెలిసిందే.

ఒడిశా రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ గిరిధర్‌ గమాంగ్‌కు ప్రత్యేకత ఉన్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్‌ సొంత రాష్ట్రం నుంచి 9 పర్యాయాలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్‌, లక్ష్మీపూర్‌ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్‌ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం వ్యవహారశైలి నచ్చక 2015లో ఆయన బీజేపీలో చేరారు. కాగా, గిరిధర్‌ సతీమణి హేమ గమాంగ్‌ 1999లో ఎంపీగా వ్యవహరించారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat