సుదీర్ఘ కాలం రాజకీయ, ప్రజా జీవితాన్ని గడిపి, అనేక పదవులు నిర్వహించిన తొలితరం కమ్యూనిస్టు నేత, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడు సోలిపేట రామచంద్రా రెడ్డి జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సిద్దిపేట ప్రాంత వాసిగా, రాజకీయ సామాజిక రంగాల్లో వారు ఆచరించిన కార్యాచరణ, ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమ లాంటి నేతలకు ఆదర్శం అన్నారు. ఆయన మరణం తీరని లోటని, గొప్ప నాయకుణ్ణి కోల్పోయామని అవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.