Home / EDITORIAL / కేసీఆర్‌ వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రతిపక్షాలు బేజారు

కేసీఆర్‌ వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రతిపక్షాలు బేజారు

ప్రతిపక్షాలు కోలుకోలేని విధంగా సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. ప్రతిపక్షాలకు కీలెరిగి వాత పెట్టినట్టుగా ఒక్కో ప్రకటన వచ్చింది. కేసీఆర్‌ సంధిస్తున్న అస్ర్తాలకు ప్రతిపక్షాలు నోరెళ్లబెట్టడం తప్ప, మాట పెగలని దుస్థితిలోకి జారుకున్నాయి. పోడు భూముల పట్టాలు, ఆర్టీసీని సర్కారులో విలీనం చేయడం, రైతు రుణమాఫీ, వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంపు, బీసీలు, మైనార్టీలకు రూ.లక్షసాయం, గృహలక్ష్మి , దివ్యాంగులకు పెన్షన్‌ పెంపు, గురుకుల విద్యార్థులకు డైట్‌ చార్జీల పెంపు, హైదరాబాద్‌ మెట్రో విస్తరణ నిర్ణయాలు ప్రతిపక్షాలను అష్టదిగ్బంధనం చేశాయి.

ఒక ఆలోచన.. ఒకే ఒక్క ఎత్తుగడ.. కేవలం ఇరవై రోజులే.. అప్పటివరకు రాష్ట్రంలో ఉన్న రాజకీయ ముఖచిత్రం మొత్తం మారిపోయింది. ప్రభుత్వంపై విమర్శలతో జోరుపెంచాలనుకొన్న ప్రతిపక్ష పార్టీల అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఇప్పుడు కనీసం మాట్లాడటానికి కూడా విపక్ష నేతలకు ఏమీ తట్టడంలేదు. దీనికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్‌ గడిచిన 20 రోజుల్లో పది అంశాలపై తీసుకున్న నిర్ణయాలు.. చేసిన ప్రకటనలే. కేసీఆర్‌ ఎత్తుగడకు చిత్తయిన ప్రతిపక్ష నేతల్లో నిస్సత్తువ ఆవరించుకొన్నది. అసలు గత ఇరవై రోజుల్లో ఏం జరిగింది? ఏయే అంశాలు అంతలా ప్రభావం చూపాయి? ఇంతలా రాజకీయ మార్పునకు దోహదపడ్డ పథకాలు ఏమిటి అనేది చూద్దాం.

వ్యూహాత్మక ఎత్తుగడ
ప్రతిపక్షాలు కోలుకోలేని విధంగా సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేశారు. ప్రతిపక్షాలకు కీలెరిగి వాత పెట్టినట్టుగా ఒక్కో ప్రకటన వచ్చింది. కేసీఆర్‌ సంధిస్తున్న అస్ర్తాలకు ప్రతిపక్షాలు నోళ్లు తెరుచుకొని చూడటం తప్ప, మాట పెగలని దుస్థితిలోకి జారుకున్నాయి. పోడు ప ట్టాలు, ఆర్టీసీని సర్కారులో విలీనం చేయడం, రైతు రుణమాఫీ, వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంచడం, బీసీ, మైనా ర్టీలకు లక్షసాయం, గృహలక్ష్మి , దివ్యాంగులకు పెన్షన్‌ పెంచడం, గురుకుల విద్యార్థులకు డైట్‌ చార్జీల పెంపుతోపాటు హైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై తీసుకొన్న నిర్ణయాలు ప్రతిపక్షాలను అష్టదిగ్బంధనం చేశాయి. వీటి ప్రభావం ప్రజ ల్లో, లబ్ధిదారుల్లో స్పష్టంగా కనపడుతున్నది. ఏం మాట్లాడాలో తెలియని విపక్ష నేతలు తిట్ల దండకం మొదలుపెడుతున్నారు.

12 పథకాల పరంపర
ఏకతాటిపైకి వచ్చిన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా సీఎం కేసీఆర్‌ 20 రోజుల్లోనే 12 ముఖ్యమైన అంశాలపై ప్రకటనలు చేశారు. దళితబంధు తరహాలోనే బీసీలకు, మైనార్టీలకు కూడా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు కొత్త పథకాలను ప్రకటించారు. సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పేరుతో రూ.3 లక్షల సాయం అందించే పథకాన్ని ప్రారంభించారు. పోడు భూములకు పట్టాలివ్వడంతో గిరిజనులు, ఆదివాసీల్లో సీఎం కేసీఆర్‌ దేవుడిలా నిలిచారు. ఆర్టీసీ ఉద్యోగులను సర్కారులో విలీనం చేసి 43 వేల మందికిపైగా కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించారు. వీఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేయడం, రేషన్‌ డీలర్లకు కమిషన్‌ పెంచడం, దివ్యాంగుల పెన్షన్‌ రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచడంతో ఆయా వర్గాలనుంచి ప్రభుత్వానికి పూర్తి మద్దతు లభిస్తున్నది. 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణమాఫీకి పచ్చజెండా ఊపటంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ నేతల నోళ్లల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. అన్ని గురుకులాల్లో డైట్‌ చార్జీలను దాదాపు 26 శాతం పెంచారు.

దీంతో ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ. 2,847 కోట్ల భారం పడినా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న నిర్ణయంతో ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి అభిమానం ఉప్పొంగింది. ఇక రాష్ట్ర రాజధానిలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్‌ భారీ ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న మెట్రోనూ నగరం నలువైపులా విస్తరించానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా మరో 310 కి.మీ పొడవైన మెట్రోను అదనంగా చేర్చడానికి రూ. 69,100 కోట్లతో ప్రణాళికను ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ పథకాల దాడితో విపక్ష నేతలు ఠారెత్తిపోతున్నారు. మొన్నటివరకు రాబోయే ప్రభుత్వం తమదేనని డబ్బా కొట్టుకొన్న విపక్ష నేతలు, పాలపొంగులా చప్పున చల్లారిపోయారు. విమర్శల జడి ముగిసింది. రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. పరిస్థితి ఉల్టాపల్టా అయ్యింది.

ప్రజలతో బీఆర్‌ఎస్‌ మమేకం
బీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆత్మీక సమ్మేళనాలు రాష్ట్రంలో నెల రోజులకుపైగా సాగాయి. పార్టీ శ్రేణులన్నీ ఒక్క త్రాటిపైకి వచ్చేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడ్డాయి. తమలోని చిన్నచిన్న పొరపొచ్చాలు, అసంతృప్తులను తగ్గించుకునేందుకు వీలు కలిగింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న 65 లక్షల కార్యకర్తల బలగం ఇప్పుడు మరింత బలంగా మారింది. ఆపై చేపట్టిన దశాబ్ది ఉత్సవాలు పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం అయ్యేందుకు వేదికలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులపాటు ఒక్కో శాఖవారీగా సాధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనడంతో ప్రజలు కూడా మమేకమయ్యారు. ఈ రెండు కార్యక్రమాలతో ఇటు పార్టీ శ్రేణుల్లో ఐక్యతారాగం, అటు ప్రజలతో ఆత్మీయత ఏర్పడింది.

ప్రతిపక్షాలది అజ్ఞానం
ఇప్పుడు కొత్తగా ప్రకటించిన పథకాలే కాదు, గతం నుంచి కూడా చాలా పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల అభిలాష మేరకు చాలా సానుకూలంగా స్పందించింది. వాటి ప్రభావం చాలా ఉన్నది. ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదని చెప్పడం అదిపెద్ద అబద్ధం. ప్రజలందరికీ తెలుస్తూనే ఉన్నది. ప్రతిపక్షాలది పూర్తిగా అజ్ఞానం. రాజకీయ విమర్శలు తప్ప మరేమీ లేవు. కాంగ్రెస్‌ చేయాల్సింది ఏంటంటే.. గతంలో తాము అమలు చేసిన పథకాలను తీసేయడం వల్ల ఇంత మందికి నష్టం జరిగిందని చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదనైనా చెప్పాలి. కానీ ఆ రెండు పార్టీలు అవి చేయడం లేదంటే రాజకీయంగా విమర్శలు గుప్పించడమే అవుతుంది. ప్రతిపక్ష పార్టీలు గతంలో తమ పాలనలో చేసిన మంచి పనులను చెప్పాలి. ఫలానా పనిచేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం ఆ పార్టీలు అవేవీ చెప్పకుండా గుడ్డిగా విమర్శించడం అవివేకం. ఇటీవల స్వల్ప కాలంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన పథకాలు బీఆర్‌ఎస్‌కు బోనస్‌. ఈ పథకాలతో ప్రజలకు పార్టీ మరింత చేరువవుతుంది.

గృహలక్ష్మి లబ్ధిదారులు: 4 లక్షలు నిధులు: 12,000 కోట్లు
ఆర్టీసీ విలీనం :లబ్ధిదారులు: 43,373
రేషన్‌ డీలర్ల కమీషన్‌ లబ్ధిదారులు: 17,227 నిధులు: 139 కోట్లు
రైతు రుణమాఫీ లబ్ధిదారులు: 29.61 లక్షలు నిధులు: 19,000 కోట్లు
దివ్యాంగుల పెన్షన్‌ పెంపు లబ్ధిదారులు: 5.11 లక్షలు నిధులు: 600 కోట్లు
గురుకులాల్లో డైట్‌ చార్జీలు లబ్ధిదారులు: 7.50 లక్షలు నిధులు: 2,847 కోట్లు
వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ లబ్ధిదారులు: 20,555
పోడు పట్టాలు లబ్ధిదారులు: 1,51,635 పంపిణీ: 4,06,389 ఎకరాలు
మెట్రో విస్తరణ పొడవు: 310 కిలోమీటర్లు నిధులు: 69,100 కోట్లు
పాలమూరు ఎత్తిపోతల 12.30 లక్షల ఎకరాలు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat