Home / SLIDER / మంత్రి జగదీష్ రెడ్డి సమయస్పూర్తి…

మంత్రి జగదీష్ రెడ్డి సమయస్పూర్తి…

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమయస్పూర్తి న్యాయ మూర్తి ప్రాణాలను నిలబెట్టింది.సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి రాత్రి 10 గంటల సమయం లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది.. ప్రమాదం లో న్యాయ మూర్తి సుజాత తీవ్రంగా గాయపడింది.

దీంతో పోలీసులు ప్రధమ చికిత్స కోసం సుజాత గారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రి కి తరలించారు. ఆ సమయం లో తిరుమలగిరి లో ఓ శుభకార్యానికి హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఏరియా ఆసుపత్రి కి చేరుకుని సుజాత ఆరోగ్య పరిస్థిితి పై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అవసరం ఉందని వైద్యులు చెప్పడం తో , వెంటనే మూడు జిల్లా ల ఎస్పీల ని అలెర్ట్ చేసి, సూర్యాపేట నుండి హైదరాబాద్ వరకు జాతీయ రహదారి పై ఉన్న పోలీసు స్టేషన్ సిబ్బంది ని ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు.

ఓ వైపు జోరు న వర్షం కురుస్తుండటం తో ఇబ్బందులు తలెత్తకుండా సుజాత గారిని తరలించే అంబులెన్స్ ను తన కాన్వాయ్ మధ్య లో ఉంచి రక్షణ గా హైదరాబాద్ కు తరలించారు.. మంత్రి గారి సమయస్పూర్తి తో కేవలం గంట పదిహేను నిమిషాలలో సుజాత గారిని హైదరాబాద్ తరలించారు.. ప్రస్తుతం న్యాయ మూర్తి సుజాత గారికి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. సకాలం లో సుజాత ను హైదరాబాద్ తరలించడం మంచి పరిణామం అని వైద్యులు తెలిపారు.. న్యాయవాది గా న్యాయమూర్తి ని సకాలం లో సుజాత ను హైదరబాద్ కు తరలించిన మంత్రి జగదీష్ రెడ్డి గారి సమయస్పూర్తి ని న్యాయవాదులు, ప్రజలు కొనియాడుతున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat