Home / SLIDER / గణేష్ ఉత్సవాల పై సర్యాపేట కలెక్టరేట్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష

గణేష్ ఉత్సవాల పై సర్యాపేట కలెక్టరేట్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష

వినాయకచవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులను పక్కన పెట్టాలని సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనపు ఏర్పాట్లపై ఆదివారం సూర్యాపేట నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, బానుపురి గణేశ్ ఉత్సవ కమిటీ బాధ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. పర్యావరణహిత గణేశ్‌ విగ్రహాలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. మండపాల్లో, ఇండ్లలోనూ పర్యావరణహిత వినాయక ప్రతిమలను ప్రతిష్టించి, పూజించాలని కోరారు. తద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు మ‌ట్టి గణపతులను నిమజ్జనం చేయడం ద్వారా కలుషితమయ్యే నీటిని నివారించవచ్చని అన్నారు.పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని, ప్రజలందరూ స్వచ్చంధంగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విధంగా ఉత్సవ కమిటీలు ప్రజలను చైతన్య పరచాలని కోరారు.సమావేశం లో 18న వినాయక చవితి… 27న నిమజ్జన తేదీలుగా నిర్ణయించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయక విగ్రహాలకు స్వస్తి పలికి, పర్యావరణహితాన్ని కలిగించే మట్టి విగ్రహాల వైపు యువత మొగ్గు చూపాలని కోరారు. పిఓపి విగ్రహాలలో వాడే రసాయనాల ద్వారా నీటితో సహా పర్యావరణం తీవ్రంగా కలుషితమవుతుంది అన్నారు. దీనివల్ల అనేక రోగాలు వ్యాపించడంతోపాటు నీటిలో జీవించే జల రాశులకు కూడా ప్రాణాపాయం పొంచి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు యువత నడుంబించాలని పిలుపునిచ్చారు. నవరాత్రి ఉత్సవాలకు మెరుగైన ఏర్పాట్లకై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వినాయకచవితి సందర్భంగా విగ్రహాలను ప్రతిష్టించి, నవరాత్రి ఉత్సవాల అనంతరం నిమజ్జనం చేసేందుకు, మండపాల ఏర్పాటుకు గాను పోలీసు, సౌండ్‌ స్టిమ్‌, లైటింగ్‌, తదితర వసతులకై ఆయా మండపాల, ఉత్సవ కమిటీ బాధ్యులు ముందస్తు గానే అనుమతి పొందాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకై కేవలం మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విధంగా భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ తో పాటు ఇతర ఉత్సవ కమిటీలు ప్రజలను చైతన్యపర్చిప్రోత్సహించాలన్నారు. సద్దుల చెరువులో గణేష్‌ నిమజ్జనం ఉంటుందని, అందుకనుగుణంగా ఆయా విగ్రహాలను నిమజ్జనం కొరకు తరలించేందుకు ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని, పోలీసు అధికారులకు సూచించారు. నిమజ్జన ప్రాంతాలలో పారిశుధ్యం, త్రాగునీరు, లైటింగ్‌, బారికేడిరగ్‌, నిమజ్జన ప్లాట్‌ఫామ్స్‌ క్రేన్స్‌ తదితర ఏర్పాట్లను మున్సిపల్ , రెవిన్యూ శాఖ ల ద్వారా చేపట్టాలని, నిమజ్జన ప్రదేశాలలో గజ ఈతగాళ్ళను సిద్దం ఉంచాలని, అగ్ని ప్రమాదాల నివారణకై ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని, మత్స్య, అగ్నిమాపక శాఖ అధికారులకు మంత్రి సూచించారు. వినాయక విగ్రహాల మండపాల వద్ద అగ్నిప్రమాదాలు సంభవించకుండా తరచుగా తణిఖీ చేపట్టాలని అదేవిధంగా నిమజ్జన ప్రదేశాలలో సరిపడా లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని విద్యుత్‌ శాఖ అధికారులకు సూచించారు.

నిమజ్జనం రోజన 24 గంటల పాటు మధ్యం షాపులను పూర్తిగా మూసివేయాలని, ఎక్సైజ్‌ శాఖాధికారులకు సూచించారు. నిమజ్జన ప్రాంతాలలో ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు చేసి అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని వైద్యశాఖాధికారులకు సూచించారు. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్, జిల్లా గ్రంధాలయ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్,ఆర్డీవో బ్రహ్మచారి, డిఎస్పి నాగభూషణం , భానుపురి ఉత్సవ కమిటీ సభ్యులు చకిలం రాజేశ్వరరావు, రంగినేని రుక్మారావు, బైరు వెంకన్న గౌడ్, అచ్యుత్ కుమార్, బైరు విజయ్ కృష్ణ, దినేష్, కౌన్సిలర్ జహీర్, అనంతుల విజయ్ , లింగంపల్లి శ్రీనివాస్ ,ఇతర రెవెన్యూ పోలీస్ మున్సిపల్ అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat