తెలంగాణలో ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బొనకల్ మండలం రాపల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ లో 35 కుటుంబాలు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అధ్వర్యంలో చేరారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పార్టీ కండువ కప్పి పార్టలోకి ఆహ్వానించారు .
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను చూసి మధిర నియోజకవర్గం లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది.
దానిలో భాగంగా రాపల్లి గ్రామంలో కాంగ్రెస్ మరియు వివిధ పార్టీల నుండి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి ఆధ్వర్యంలో 35 కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన కొత్తవారు పాతవారు కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని అన్నారు.