Breaking News
Home / SLIDER / మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం

మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం

బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన ఎస్సిమాదిగ సంఘం నుంచి 32 కుటుంబాలు బుధవారం మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మాన పత్రాలను మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,జడ్పీటీసీ దాసరి లావణ్య-వెంకటేష్ లకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు బాల్కొండ నియోజవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి వైపు మా ఓటు అంటూ బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన 32 మంది సంఘ సభ్యులు కలిసి తీర్మాన పత్రాలను అందజేశారని తెలిపారు.

సంఘ సభ్యులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి ఓటు వేస్తామని ప్రమాణం చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు.మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలు మర వకుండా మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కిసాన్ నగర్ గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించేందుకు పూర్తిమద్ధతు పలుకుతామని వారు తెలిపారు.

ఈకార్యక్రమంలో సర్పంచి మానేటి తులసి నాగభూషణం, ఎంపీటీసీ సభ్యులు అనుగుల రాం రాజ్ గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షుడు ఎంబరి శరత్,మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,మాదిగ సంఘం అధ్యక్షుడు గడ్డం యాదగిరి,ఉపాధ్యక్షులు మల్లమర్రి రాములు,కోశాధికారి మల్లమర్రి లక్ష్మన్,సభ్యులు నాగేల్లి కొమురయ్య,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino