Breaking News
Home / SLIDER / కరీంనగర్ లో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు

కరీంనగర్ లో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు

జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలంలోని తీగలగుట్టపల్లి లో గల ఉత్తర తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.అనంతరం కరీంనగర్ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, తెలంగాణ పోరాట యోధుల కుటుంబాలను, స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు, నాటి పోరాట వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. నాడు నేడు తెలంగాణ ఉద్యమాన్ని, అందులో పాల్గొన్న తెలంగాణ ప్రజానీకాన్ని, అమరవీరులను ఘనంగా స్మరించుకున్నారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో సుదీర్ఘమైన మలిదశ పోరాటం జరిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంతోపాటు కేసీఆర్ గారి సారథ్యంలో దేశంలోనే అన్ని రంగాల్లో నెంబర్వన్ గా తెలంగాణ ఎదుగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు ప్రజలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino