సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మూడో విడతలో ఎంపికైన లబ్దిదరులతో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ గురువారం ముఖాముఖీ ని నిర్వహించారు. మూడో విడత డ్రా లో భాగంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1770 మందికి డబల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించారు.
తూముకుంట, మురారి పల్లీ ప్రాంతాల్లో ఇళ్ళను కేటాయించిన ఈ లబ్దిదారులు లాలాపేట సమీపంలోని ప్రశాంతి నగర్ గ్రౌండ్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన ఆర్టీ సీ బస్సుల్లో తరలివెళ్ళారు. వారిని డిప్యూటీ పద్మారావు గౌడ్ కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత లతో కలిసి అభినందించారు. పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవ్వరికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా, ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం లక్షల విలువచేసే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఉచితంగా అందిస్తోందని తెలిపారు.
దళారీలను ఆశ్రయించ రాదని, ఏదైనా సమాచారానికి సితాఫలమండీ లోని తమ కార్యాలయాన్ని సంప్రదించ వచ్చున్ని సూచించారు. లబ్దిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కెసిఆర్ కు, పద్మారావు గౌడ్ కు అనుకూలంగా నినాదాల హోరెత్తించారు. తమ సొంతింటి కల నెరవేరిందని పలువురు లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు.