ప్రస్తుతం ఈ వేసవిలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఆనందపరిచే ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్.ఐపీఎల్ వస్తే చాలు అందరికి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది.మన భారత్ క్రికెటర్స్ మరియు అన్ని దేశాల ప్లేయర్స్ ఇందులో ఆడతారు.అందరిని ఒక్కచోటే చూసే ఇలాంటి ఈవెంట్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకుంది.అయితే ప్రస్తుత జట్లలో ఎవరి బలం ఎలా ఉందో చూస్తే..గత ఏడాది టైటిల్ సాదించిన చెన్నై సూపర్ కింగ్స్ హాట్ ఫేవరెట్ గా ఉండగా ఈసారి కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.అదే ఏడాది గట్టి పోటి ఇచ్చిన హైదరాబాద్ టీం రెండో స్థానంలో ఉండగా ఈసారి మాత్రం తడబడుతుంది.ఇక మన స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పైనే అందరి దృష్టి.ప్రతీ సీజన్లో మంచి ఆట కనబరుస్తూ చివరకు వచ్చేసరికి మాత్రం చేజార్చుకుంటుంది.అలాంటి కోహ్లి సారధ్యం వహిస్తున్న ఈ జట్టు ఈసారి మొదటి స్థానంలో ఉంది…చివరి నుండి..!! వరుసగా అన్ని మ్యాచ్ లు ఓడిపోతుంది.ఈ ఏడాది ఐపీఎల్ లో ముందుగా వైదొలిగే జట్టు ఇదే కావొచ్చు.