Home / POLITICS / అనుమానం రేకెత్తిస్తున్న ధోనీ ర‌న్ ఔట్‌.!

అనుమానం రేకెత్తిస్తున్న ధోనీ ర‌న్ ఔట్‌.!

దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ సారి ఐపీఎల్ క్రేజ్ అంత‌గా ఉండ‌ద‌ని అంద‌రూ భావించారు. అంద‌రి అంచ‌నాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో ఐపీఎల్ అభిమానుల‌ను అల‌రించింది. అన్ని మ్యాచుల్లోనూ ఇరు జట్లు నువ్వానేనా అన్న‌ట్లుగా పోటీప‌డ‌గా చివ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్ ఫైన‌ల్ బెర్తు ఖ‌రారు చేసుకున్నాయి. రెండు జ‌ట్లు ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా గ‌ట్టి జ‌ట్లు అందులోనూ ఇరు జ‌ట్లూ గ‌తంలో మూడు సార్లు క‌ప్ గెలిచాయి. ఈ సారి గెలిచిన టీమ్ నాలుగు సార్లు క‌ప్ సాధించిన జ‌ట్టుగా రికార్డుల‌కెక్కుతుంది. దీనిపై ఇరు జ‌ట్ల అభిమానుల్లోనూ తీవ్ర అస‌క్తి నెల‌కొంది. ఐపీఎల్ ఫైన‌ల్ అందుల‌నూ ఆదివారం కావ‌డంతో అభిమానుల‌తో ఉప్ప‌ల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఐపీఎల్ ఫైన‌ల్ వీక్షిస్తూ టీవీల‌కు అతుక్కుపోయారు.

హైద‌రాబాద్ పిచ్ బ్యాటింగ్ పిచ్ కావ‌డంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియ‌న్స్ తొలి 6 ఓవ‌ర్ల ప‌వ‌ర్ ప్లేలో చెల‌రేగిన‌ప్ప‌టికీ డీకాక్ అవుట్ అవ‌డంతో స్కోర్‌బోర్డ్ కాస్త నెమ్మ‌దించింది. ఆ వెనువెంట‌నే రోహిత్ శ‌ర్మ అవుటవ‌డం. మిడిల్ ఆర్డ‌ర్ కూడా కుప్ప‌కూల‌డం.. పోలార్డ్ చివ‌రి మూడు ఓవ‌ర్ల‌లో చేల‌రేగి ఆడ‌టంతో 149 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చెన్నై ముందుంచింది.

150 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న కోసం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు షేన్‌వాట్స‌న్‌, ఫాఫ్ డుప్లెస్సీ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ప‌వ‌ర్ ప్లేలోని తొలి 6 ఓవ‌ర్లు ప‌రుగుల వ‌ర‌ద పారించారు. డుప్లెస్సీ అవుట‌వ్వ‌డంతో తొలివికెట్ కోల్పోయిన చెన్నై సూప‌ర్‌కింగ్స్ రైనా – వాట్స‌న్ భాగ‌స్వామ్యంలో ప‌రుగుల వ‌ర్షం కురిసింది. రైనా 8 ప‌రుగులు చేసి అవుట్ అవ్వ‌గానే అంబ‌టి రాయుడు క్రీస్‌లోకి వ‌చ్చి ఒక్క ప‌రుగుకే వెనుదిరిగాడు. ఇక ఫోర్త్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పుల్ షార్ట్‌కు ప్ర‌య‌త్నించిన వాట్స‌న్ చేతికున్న గ్లోవ్స్‌కి త‌గ‌ల‌డంతో ముంబై ఫీల్డ‌ర్ ఇషాన్ కిష‌న్‌వైపుగా బంతి వెళ్ల‌గా సునాయ‌సంగా సింగిల్ తీసిన ధోనీ రెండో ప‌రుగు తీసే క్ర‌మంలో ర‌న్ అవుట్ అయ్యాడు. స‌రిగ్గా ఇదే అంశం ఇప్పుడు ధోనీ అభిమానుల్లో తీవ్రమైన అనుమానాలు రేకెత్తిస్తుంది. ముంబై ఇండియ‌న్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశార‌ని, నాట్ అవుట్‌ని కూడా ఔట్‌లాగా చిత్రీక‌రించారంటూ నెటిజ‌ట్లు ముంబైపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉంటే థ‌ర్డ్ అంపైర్ ఒకే యాంగిల్‌లో చూసి ఔట్‌గా ప్ర‌క‌టించ‌డం స‌రికాద‌ని, అన్ని యాంగిల్స్‌లో చూసి స‌రైన నిర్ణ‌యం ప్ర‌క‌టించాల్సింద‌ని స‌గ‌టు క్రికెట్ అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముంబై టీమ్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ మీమ్స్‌తో నెటిజ‌న్లు ట్రోల్ చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే అయిన‌ప్ప‌టికీ.. స‌రిగ్గా ఇప్పుడు ఫైన‌ల్ మ్యాచ్‌లో థ‌ర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణ‌య‌మే క్రికెట్ అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. ముంబై ఇండియ‌న్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డిందా?.. ధోనీని అన్యాయంగా ఔట్ చేశారా..? ఇలా అభిమానుల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది. క్రికెట్ క్రీడ కార్పొరేట్ వ్య‌క్తుల విష‌పు కొర‌ల్లో చిక్కుకుంద‌న్న అనుమానాల‌కు దారితీస్తుంది.