Breaking News
Home / 18+ / అద్భుతమైన ఆటతో దుమ్మురేపుతున్న ఇంగ్లాండ్..మరి ఇండియా పరిస్థితి?

అద్భుతమైన ఆటతో దుమ్మురేపుతున్న ఇంగ్లాండ్..మరి ఇండియా పరిస్థితి?

మరికొద్ది రోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ రాబోతుంది.మరి ఇలాంటి సమయంలో ఎవరికైనా టైటిల్ మేమే కొట్టాలి అనే పట్టుదల స్ఫూర్తి ఉంటుంది.అన్ని జట్లు కూడా ప్రాక్టీస్ పరంగా చాలా కష్టపడుతున్నారు.ఇక ఇంగ్లాండ్,పాకిస్తాన్,వెస్టిండీస్,బంగ్లాదేశ్ అయితే సిరీస్ అడుతున్నారు కాబట్టే అది కూడా మంచికే అని చెప్పాలి.ఇంగ్లాండ్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ చూస్తే మాత్రం ప్రపంచకప్ ఈ ఈసారి ఇంగ్లాండ్ దే అని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే..ఒక పక్క ఇది ఇంగ్లాండ్ కు హోమ్ టౌన్,మరొకటి ఆ జట్టు ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో ఎంత టార్గెట్ ఇచ్చిన అలవోకగా కొడుతున్నారు.ఓపెనర్స్ మిడిలార్దర్ స్ట్రాంగ్ గా ఉన్నారు.అంతేకాకుండా బౌలర్స్ కూడా బాగానే రాణిస్తున్నారు.ఇండియా విషయానికి వస్తే మొదట వరల్డ్ కప్ ఫేవరెట్ జట్టు లో ఇంగ్లాండ్,ఇండియానే అని చెప్పేవారు.ఇప్పుడు మాత్రం ఇండియా అంటే అందరు అనుమానంగానే చూస్తున్నారు.