Home / TELANGANA / సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన మంత్రి కేటీఆర్..!

సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన మంత్రి కేటీఆర్..!

సీఎం కేసీఆర్ 66 వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు.. దక్షిణాఫ్రికా, మలేషియా, ఆస్ట్రేలియా, అమెరికా, యుకే వంటి దేశాల్లొ టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగం నాయకులు కేసీఆర్‌ బర్త్‌డేను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక దేశం నలుమూలల నుంచి ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రికి ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తమకు ఆదర్శం అని పేర్కొన్నారు. ఈ మేరకు… ‘‘ నాకు తెలిసిన ధైర్యశాలి.., విలక్షణ వ్యక్తిత్వం గల, దయామయుడైన.. చరిష్మా గల వ్యక్తి.. ఆయనను నాన్నా అని పిలవడానికి నేనెంతో గర్విస్తాను.. మీరు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్థిల్లాలి. దూరదృష్టి, నిబద్ధత కలిగిన మీరు.. ఇలాగే కలకాలం మాకు ఆదర్శంగా నిలవాలి. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను తెలంగాణ తల్లిని కన్న తనయుడిగా పేర్కొంటూ కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.