Home / SPORTS / టీ20 ప్రపంచకప్: శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం !

టీ20 ప్రపంచకప్: శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం !

ఆస్ట్రేలియా వేదికగా జరుతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా దూసుకుపోతుంది. తిరుగులేని విజయాలను నమోదు చేస్తుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ కు వెళ్ళిన భారత్ నేడు శ్రీలంకతో జరిగిన నాలుగో మ్యాచ్ లోను 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ మరోసారి అద్భుతమైన బ్యాట్టింగ్ చేసి 47పరుగులు సాధించింది. ఇక ఇండియా బౌలర్స్ రాధా యాదవ్4, రాజేశ్వరి 2, శిఖా పాండే, పూనమ్, దీప్తి చరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ తో భారత్ తిరుగులేని జట్టుగా నిలిచింది. ఇక మొదటి మూడు మ్యాచ్ లు ఫస్ట్ బ్యాట్టింగ్ చేసిన ఇండియా ఈసారి చేజింగ్ చేసి విజయం సాధించింది.