Home / SPORTS / సిడ్నీ సెటిల్మెంట్..మాయా లేదు మర్మం లేదు..అందుకే భారత్ నేరుగా ఫైనల్ కు !

సిడ్నీ సెటిల్మెంట్..మాయా లేదు మర్మం లేదు..అందుకే భారత్ నేరుగా ఫైనల్ కు !

ఎప్పుడెప్పుడా అని ఎదుర్చుస్తున్న మహిళ టీ20 ప్రపంచకప్ సెమీస్ నేడు జరుగుతుందని అందరు వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. రెండు సెమీస్ లు ఈరోజే కావడంతో సిడ్నీ గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోతుంది అనుకున్నారంత. కాని అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇంగ్లాండ్,ఇండియా మధ్య జరగనున్న మొదటి సెమీస్ ప్రారంభం కాకముందే వర్షం రావడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. దాంతో ఇంగ్లాండ్ అభిమానులు మాత్రమే నిరాశకు గురయ్యారు ఎందుకంటే ఈ మ్యాచ్ మధ్యలో ప్రారంభం అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కాని మొత్తానికే ఆగిపోతే భారత్ ఫైనల్ కు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ కు రిజర్వు డే లేదు అంతేకాకుండా గ్రూప్ ఏ లో భారత్ మొదటి స్థానంలో ఉండడం భారత్ కు కలిసొచ్చింది. ఇదే తరహాలో రెండో సెమీస్ కూడా జరగకుంటే సౌతాఫ్రికా ఫైనల్ కు చేరుకుంటుంది.