పెళ్లయిన తరువాత పిల్లలను ఎప్పుడు కనాలి అనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు పెళ్లయిన వెంటనే పిల్లలను కంటారు. మరి కొందరు పళ్లై సంవత్సరాలు గడిచినా పిల్లలు కనడానికి ఇష్టపడరు. మరి కొందరు పెళ్లి కాగానే ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులు తెలియక వెంటనే పిల్లలను కంటుంటారు. పెళ్లయిన జంట పిల్లలు కనే విషయంలో తప్పకుండా వైద్యున్ని సంప్రదించి అతను ఇచ్చిన సలహాను పాటించాలి.
వెంటనే పిల్లలు వద్దనుకుంటే పిల్లలు పుట్టకుండా ఉండేందుకు డాక్టరు చెప్పిన పద్ధతులు పాటించాలి. మరీ తక్కువ వయసు(21 కంటే ముందు)లోను మరీ ఎక్కువ వయసు వచ్చిన తరువాత పిల్లలు కంటే మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా మహిళలు రజస్వల అయినప్పటినుంచి ప్రతినెలా వారిలో అండాల ఉత్పత్తి తగ్గుతుంది. 37 ఏళ్లు వచ్చేసరికి అండాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. మగవారిలో కూడా వయసు మీదపడే కొద్ది వీర్యం నాణ్యత(కౌంటింగ్) తగ్గుతూ వస్తుంది.
40 ఏళ్ల తరువాత పిల్లకోసం ప్రయత్నిస్తే పుట్టే పిల్లలు శారీరకంగా, మానసికంగా లోపాలతో పుడతారని వైద్యనిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో ఆటిజం తలెత్తే అవకాశమున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. దంపతులు లేటు వయసులో పిల్లలను కనటం మంచిది కాదని చెబుతున్నారు. మహిళలు 21 నుంచి 29 ఏళ్లలోపు, పురుషులు 40 ఏళ్లు వచ్చేలోపు పిల్లలకు ప్లాన్ చేసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబతున్నారు.