గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన హరిత హారం కార్యక్రమం స్ఫూర్తితో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఆకుపచ్చని మహోద్యమంలా సాగుతోంది. మంత్రి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఎంపీ సంతోష్ స్వయంగా 2042 ఎకరాల కీసర రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకుని ఎకో టూరిజం పార్కుగా డెవలప్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి..మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేయాలన్న ఎంపీ సంతోష్ పిలుపుకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. కేంద్రమంత్రులు, క్రీడాకారులు, సినీ సెలబ్రిటీలు, ఐఏయస్, ఐపీఎస్ అధికారులు, స్వామిజీలు, స్వచ్చంధ సంస్థలు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు..ఇలా అన్ని వర్గాల ప్రజలు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి ప్రకాష్ జవదేవకర్, విరాట్ కోహ్లి, పివి సింధూ, సానియామీర్జా, ఐపీయస్ అధికారిణి హరిచందనా, విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వంటి ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం విశేషం. ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా 3 కోట్లకు మొక్కలు నాటడం విశేషం. తాజాగా డిసెంబర్ 7న తన పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ సంతోష్ #SelfieWithSaplingOnJSKBirthday పేరుతో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ” నేలంతా పచ్చగా ఉంటే.. మనషులంతా చల్లగా ఉంటారనే సీఎం కేసీఆర్ మాటలతో స్ఫూర్తి పొంది.. గతేడాది ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలో నా మిత్రులను మరియు శ్రేయోభిలాషులందరినీ భాగస్వామ్యులను చేశారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు తన పుట్టిన రోజు సందర్భంగా మీరందరూ ఒక మొక్కను నాటుతూ దిగిన సెల్ఫీని తనకు బహుమతిగా పంపించాలని విజ్ఞప్తి చేశారు. మీరు మొక్క నాటుతూ దిగిన సెల్ఫీలతో తన ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ నిండిపోయేలా చేస్తారని ఆశిస్తున్నాను అంటూ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కను నాటి సెల్ఫీ దిగి పంపితే అదే నాకు మీరు ఇచ్చే పుట్టిన రోజు కానుక అని ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #SelfieWithSaplingOnJSKBirthday యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది.
తేదీ 07.12.2019 రోజున నా పుట్టినరోజు,
నాకు మీనుండి ఒక బహుమతి కావాలి. pic.twitter.com/8e2mmd6dRy
— Santosh Kumar J (@MPsantoshtrs) December 5, 2019