Breaking News
Home / SPORTS / ప్రపంచలోనే అతిపెద్ద స్టేడియం ఐపీఎల్ ఫైనల్ కువేదిక కానుందా..?

ప్రపంచలోనే అతిపెద్ద స్టేడియం ఐపీఎల్ ఫైనల్ కువేదిక కానుందా..?

ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇది ఇండియాలో జరుతున్నప్పటికీ అన్ని దేశాల క్రికెట్ ప్రియులకు ఎంతో ఇష్టమని చెప్పాలి. అయితే ఇక 2020 ఐపీఎల్ మొదటి మ్యాచ్ కు ముంబై వేదిక అనే విషయం తెలిసిందే. ఇదివరకే ఉన్న సమాచారం ప్రకారం మార్చ్ 29 నుండి మే 24 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏది అనే విషయానికి వస్తే అది మెల్బోర్న్ అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచంలోనే లక్ష మంది కూర్చునే సామర్థ్యం కలిగిన అతిపెద్ద క్రికెట్ మైదానం ఇది.

 

 

అయితే ఇప్పుడు బీసీసీఐ, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్  కలిపి 1.1 లక్షలకు పైగా కూర్చునే సామర్థ్యంతో గుజరాత్‌లో కొత్త స్టేడియంను సిద్ధం చేస్తున్నాయి. ఈ స్టేడియం పేరు సర్దార్ పటేల్ స్టేడియం, ఇది అహ్మదాబాద్‌లో ఉంది. అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈ స్టేడియంలో పెట్టబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదివరకే ఇక్కడ ఆసియాXI , వరల్డ్ XI మధ్య మ్యాచ్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కాని కొన్ని పనులు ఇంకా పుర్తికాలేదనే కారణంగా అది రద్దు అయింది. మరి ఐపీఎల్ ఫైనల్ జరగనుందో లేదో మరి వచ్చే నెల వరకు వేచి చూడాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino