Home / SPORTS / తన భార్య కోసం అర్ధాంతరంగా జట్టుకు వదిలేసినా స్టార్క్..ఎందుకంటే?

తన భార్య కోసం అర్ధాంతరంగా జట్టుకు వదిలేసినా స్టార్క్..ఎందుకంటే?

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి వన్డే జరగనుంది. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్ అనుకోకుండా జట్టుకి దూరం అయ్యాడు. అంటే అతడి గాయం, లేదా ఫిట్నెస్ ఇలాంటివి ఏమి కారణాలు కాదు. కాని అసలు కారణం తెలుసుకుంటే షాక్ అవుతారు. అదేమిటంటే ఈ ఆదివారం నాడు ఇండియా ఆస్ట్రేలియా మధ్య టీ20 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఆ మ్యాచ్ లో కామెంటేటర్ వెళ్తున్నాడెమో అనుకోవచ్చు కాని అవేమి కాదు. కేవలం తన భార్య ప్రస్తుత అసీస్ కీపర్  అలిస్సా హీలీకి సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాడు. ఈ మేరకు టీమ్ మేనేజ్మెంట్ పర్మిషన్ ఇచ్చినట్టు జస్టిన్ లాంగర్ తెలిపారు.