Home / NATIONAL / మొదటి నుండి తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమే

మొదటి నుండి తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమే

ప్రధాని మోదీ మరోసారి తెలంగాణపై విషంకక్కారు. చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారంటూ పార్లమెంటు సాక్షిగా అడ్డగోలు వ్యాఖ్యలుచేశారు. తెలంగాణపై మోదీ మొదటినుంచీ అక్కసును వెలిబుచ్చుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచే.. మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా అవకాశం లభించిన ప్రతిసారీ మాట్లాడుతూనే ఉన్నారు. వాస్తవానికి ఉద్యమం తీవ్రస్థాయికి చేరేంతవరకూ బీజేపీ తెలంగాణ పట్ల సానుకూలంగా లేదు.

కాకినాడ తీర్మానానికి మంగళం
1998లో తెలంగాణ ఏర్పాటును సమర్ధిస్తూ కాకినాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. ‘ఒక ఓటు రెండు రాష్ర్టాలు’ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నెత్తికి ఎత్తుకున్నది. నాటి బీజేపీ నేతలు బంగారు లక్ష్మణ్‌, శేషగిరిరావు ఈ తీర్మానం పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడు కేంద్రంలోనూ వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభు త్వం అధికారంలో ఉన్నది. నోటిమాటకే తప్ప కేంద్రం పై పెద్దగా ఒత్తిడి తెచ్చిందే లేదు. 2000 నవంబర్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలను ఏర్పాటుచేసింది. కానీ తెలంగాణను మాత్రం పక్కనబెట్టింది.

అద్వానీ తక్కువేం కాదు
‘అభివృద్ధిలో ప్రాంతాల మధ్య భేదాలు చూపుతున్నారనే కారణంతో రాష్ర్టాన్ని ఏర్పాటుచేయలేం. ప్రాంతీయ అసమానతలను అభివృద్ధి ద్వారా పరిష్కరించుకోవచ్చని.. అందుకే తెలంగాణ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని 2002లో అప్పటి ఎంపీ ఆలె నరేంద్రకు నాటి డిప్యూటీ ప్రధానమంత్రి ఎల్‌కే అద్వా నీ లేఖ రాశారు. ఇదే అద్వానీ.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో స్టీరింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉండి.. ‘రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ర్టాన్ని కోరడం ఏమిటి?’ అంటూ ఎద్దేవాచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్లేటు ఫిరాయించారు. ‘మేం తెలంగాణను ఎప్పుడో ఏర్పాటు చేయాల్సింది. భాగస్వామ్యపక్షాల ఒత్తిళ్ల వల్ల ఏర్పాటు చేయలేకపోయాం’ అంటూ కుంటిసాకులు చెప్పారు.

తెలంగాణ బీజేపీ నేతలు ఏమంటారు?
తాము మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందంటూ హడావుడి చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పు డేం చెప్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘బండి సంజ య్‌.. మోదీ వ్యాఖ్యలను నువ్వు సమర్థిస్తున్నావా’ అంటూ నిలదీస్తున్నారు. ‘కిషన్‌రెడ్డీ.. మౌనంగా ఉం టే మోదీ వ్యాఖ్యలను మీరు స్వాగతించినట్టు అనుకోవాల్సి వస్తుంది’ అని హెచ్చరిస్తున్నారు.

మోదీ.. మొదటి నుంచీ అక్కసే
ఎక్కడి పాట అక్కడ పాడినట్టు.. తెలంగాణ ఏర్పాటుపై పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంలో ప్రధాని నరేంద్రమోదీకి సరితూగేవాళ్లే లేరు. ‘కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటుచేయడం స్వాగతించదగ్గ నిర్ణయం. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇన్నేండ్లుగా కమిటీలు, రిపోర్టులు అంటూ విభజనను ఆలస్యం చేసినందుకు తెలుగు ప్రజలకు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్తుందా?’ అంటూ 2013 జూలై 30న వ్యాఖ్యానించిన మోదీ.. ఆరు నెలల్లోనే నాలుక మడతపెట్టేశారు. ‘తల్లిని చంపి బిడ్డను బతికించినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. సీమాంధ్ర ప్రాంతాన్ని కాంగ్రెస్‌ పార్టీ అనాథగా మార్చివేసింది’ అంటూ 2014 ఫిబ్రవరి 28న కర్ణాటకలోని గుల్బర్గాలో అక్కసు వెళ్లగక్కారు. ప్రధాని అయిన తర్వాత సందర్భం వచ్చిన ప్రతిసారి తెలంగాణపై విషం కక్కుతూనే ఉన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat