తెలంగాణ రాష్ట్రాధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏపీలోని విజయవాడకు వెళ్లనున్నారు. వచ్చే నెల అక్టోబర్ 14 నుంచి 18 వరకు జరగనున్న సీపీఐ జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొననున్నారు.
ఈ సభలకు కేరళ, బిహార్ సీఎంలు పినరయి విజయన్, నితీష్ కుమార్ తో పాటు 20 దేశాల నుండి కమ్యూనిస్ట్ నేతలు హాజరుకానున్నారు. అయితే మూడేళ్ల తర్వాత సీఎం కేసీఆర్, ఏపీకి వెళ్లనున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ స్వయంగా సీఎం జగన్ను ఆహ్వానించారు.