ప్రపంచాన్ని వణికించే కరోనా మళ్లీ వస్తే ఎదుర్కొనే శక్తి తెలంగాణకు ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మమ్త్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
గురువారం మీడియాతో మాట్లాడుతూ… ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతమవుతోందని అన్నారు. బిడ్డ కడుపులో ఉండగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బిడ్డ బయటికి వచ్చాక కేసిఆర్ కిట్ అందిస్తున్నామని తెలిపారు.
మహారాష్ట్ర నుంచి వైద్యం కోసం తెలంగాణకు వస్తున్నారన్నారు. మిషన్ భగీరథ నీటితో డయేరియా, మలేరియా, కలరా వ్యాధులు తగ్గాయని చెప్పారు. మూడు రోజుల్లో 950 డాక్టర్ల నియమించబోతున్నామని వెల్లడించారు. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొడుతోందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.