Home / NATIONAL / కొత్తగా 10,753 కరోనా కేసులు

కొత్తగా 10,753 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌   వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. శనివారం కూడా 10వేలకు పైనే కొత్త కేసులు బయటపడ్డాయి.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 1,58,625 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 10,753 కేసులు బయటపడ్డాయి.

మరోవైపు దేశంలో యాక్టివ్‌ కేసుల   సంఖ్య 53,720కి చేరింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,43,22,211 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,091కి ఎగబాకింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat