తెలంగాణరాష్ట్ర మంత్రులు డా. వి. శ్రీనివాస్ గౌడ్, డా. పట్నం మహేందర్ రెడ్డి గార్లు చేవెళ్ల నియోజక వర్గ పర్యటనలో బీసీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బీసీ బంధు పథకం లో భాగంగా 300 మంది బీసీ & ఎంబీసీ చేతి వృత్తిదారుల లబ్దిదారులకు 3 కోట్ల రూపాయల చెక్కును స్థానిక ఎమ్మెల్యే యాదయ్య గారితో కలిసి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచ్ లు, ఎంపీటీ ,జెడ్పీటీసీలు, మార్కేట్ కమిటీ చైర్మన్ లు, జిల్లా ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.