తెలంగాణలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో 395 మందికి రూ.3.95 కోట్ల విలువైన బీసీ బంధు ప్రొసీడింగ్స్, 361 మంది దివ్యాంగులకు పెంచిన ఫించన్ రూ.3016 నుండి రూ.4016 ప్రొసీడింగ్స్ లబ్దిదారులకు ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, రాష్ట్ర సహకార సంస్థల చైర్మన్ రాజా వరప్రసాద్ రావు, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ , జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు