Home / 18+ / ఇవే ప్లేఆఫ్స్ కి అర్హత సాధించిన జట్లు…!

ఇవే ప్లేఆఫ్స్ కి అర్హత సాధించిన జట్లు…!

ఇండియన్ ప్రీమియర్ లీగ్..భారత్ లో ఒక బడా ఈవెంట్ అని చెప్పుకోవాలి.ఎందుకంటే బెట్టింగ్ రాయుళ్ళు కి ఇది పెద్ద ఆట కుర్రకారు మొత్తం ఎంజాయ్ చేసే గేమ్ ఇది.అయితే నిన్న జరిగిన చివరి మ్యాచ్ తో లీగ్ దశ పూర్తి అయింది.కేకేఆర్ పై ముంబై గెలవడంతో అనుకోకుండా హైదరాబాద్ జట్టు నాలుగో ప్లేస్ కైవసం చేసుకుంది.ఇప్పుడు ఈ నాలుగు జట్లు ప్లేఆఫ్స్ కు ఎలా వచ్చాయో మనం తెలుసుకుందాం..

ముంబై ఇండియాన్స్:
ముంబై ఇండియాన్స్..ఈ జట్టు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది రోహిత్ శర్మ ఎందుకంటే తన కెప్టెన్సీలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు టైటిల్స్ సాధించాడు.ఐపీఎల్ లో టాప్ జట్లలో ఇది ఒక్కటి.2019లో కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ ఇప్పుడు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.లీగ్ దశలో మొదటిలో కొంచెం వెనకబడినా తరువాత పుంజుకుంది.ఇక ఈ జట్టు చెన్నై వేదికగా హోమ్ టీమ్ తో ఈ నెల 7న తలపడనుంది.ఇందులో గెలిచినా జట్టు డైరెక్ట్ గా ఫైనల్ కు అర్హత సాదిస్తుంది.

చెన్నై సూపర్ కింగ్స్:
ఐపీఎల్ మొదలు ఇప్పటివరకూ కూడా చెన్నై కు ఎదురులేదని చెప్పాలి ఎందుకంటే..2008 నుండి ఇప్పటివరకు కూడా ఈ జట్టు టాప్ లో నిలిచింది.ఈ మొత్తానికి కారణం ఎవరు అంటే భారత్ మాజీ సారధి మహేంద్రసింగ్ ధోని.ప్రతీ జట్టుకి ఇప్పటివరకూ చాలా కెప్టెన్ లు మారారు గాని ఈ జట్టుకి మాత్రం మొదటి నుండి ధోనినే.తన తెలివి తేటలతో అన్ని సీజన్లో టాప్ లో ఉంచాడు.ధోని సారధ్యంలో చెన్నై ఏకంగా మూడుసార్లు తీసుకొచ్చాడు.ఈ సీజన్లో కూడా చెన్నై మంచి ఆట తీరుతో రెండో స్థానంలో ఉంది.ఈ నెల 7న ముంబై తో తలబడనుండి.

ఢిల్లీ కేపిటల్స్:
ఢిల్లీ కేపిటల్స్ ఈ ఐపీఎల్ లో ఏమాత్రం అంచనాలు లేకుండా దిగిన జట్టుగా మన చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పట్లో ఈ జట్టుకు డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కెప్టెన్ గా వ్యహరించారు.అప్పుడు ఆ టీమ్ చాలా గట్టిగా ఉందని చెప్పాలి.అప్పటినుండి ఆ జట్టు స్వరూపం మారిపోయింది..ఏ సీజన్లో కూడా ప్లే ఆఫ్స్ కు రాలేకపోయింది.కాని ఈ సీజన్లో మాత్రం అందరి అంచనాలు తారుమారు చేసి ఈసారి టాప్ లో నిలిచారు.అయితే ఈసారైన టైటిల్ కొడుతుందా అనేది వేచి చూడాలి.

సన్ రైజర్స్ హైదరాబాద్:
హైదరాబాద్ జట్టు ఐపీఎల్ మొదలైన రెండు సీజన్లోనే టైటిల్ సాదించింది.కాని అప్పుడు టీం మేనేజ్మెంట్ డెక్కన్ చార్జెర్స్ గా ఉండేది.ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా సార్లు తన అద్భుతమైన బ్యాటింగ్ తో సన్ రైజర్స్ ఎన్నో విజయాలు తీసుకొచ్చాడు.గత ఏడాది కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ లో ఫైనల్ కి చేరిన చెన్నై చేతిలో ఓటమి తప్పలేదు.ఈ ఏడు మొదటిలో వార్నర్ మరియు ఇంగ్లాంగ్ కీపర్ దయవల్ల ముందుకు వచ్చిన..వాళ్ళు వెళ్ళిపోయినా తరువాత అన్ని ఓటములే ఎదురయ్యాయి.ఎలాగైతేనో నిన్న కేకేఆర్ ఓడిపోవడంతో మంచి రన్ రేట్ హైదరాబాద్ కి ఉండడంతో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat