Home / BUSINESS / ఐసీఐసీఐ బ్యాంకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ..?

ఐసీఐసీఐ బ్యాంకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ..?

దేశంలోని ప్రముఖ బ్యాంకు అయిన ఐసీఐసీఐ తన వినియోగదారులకు శుభవార్తను ప్రకటించింది .ప్రస్తుతం దేశంలో టాప్ టెన్ బ్యాంకు లలో ఒకటైన ఐసీఐసీఐ వినియోగదారులను ఆకర్శించుకోవడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది .దీనిలో భాగంగా ప్రస్తుత పండగల సీజను సందర్భంగా ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఐసీఐసీఐ బ్యాంకు ఆవిష్కరించింది .

ఈ నెల ఒకటో తారీఖు నుండి నవంబర్ ముప్పై తేదీలోపు గృహ రుణాన్ని తీసుకునే కస్టమర్లకు ఈ పథకం వర్తిస్తోంది . కొత్త గృహ ఋణం పొందేవారు లేదా ప్రస్తుత గృహ రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంకుకు బదలాయించేవారు రూ పదివేల పరిమితికి లోబడి క్యాష్ బ్యాక్ ఆఫర్ ను పొందగల్గుతారు.

అదే సమయంలో ఈ ఆఫర్ ను పొందాలంటే కస్టమర్ తప్పనిసరిగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డును కల్గి ఉండాలి .దీనిపై కనీసం రూ ముప్పై వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది .