ఐపీఎల్ ఈ పేరు వింటే ఎవరికైనా సరే ఎక్కడలేని బలం, ఉత్సాహం వచేస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభించారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతీ ఏడాది దీనికి మరింత బలం పెరిగింది తప్పా ఆ ఊపు పోలేదనే చెప్పాలి. అభిమానులు పెరుగుతూనే వచ్చారు. ఈ ఐపీఎల్ పేరు చెప్పి అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉన్న జట్టు ఏదైనా ఉంది అంటే అది చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అనే చెప్పాలి. వారికున్న ఫాలోయింగ్ వేరేవాళ్ళకి ఉండదని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే 2010 నుండి 2019 వరకు అంటే ఈ దశాబ్దకాలం వరకు చూసుకుంటే అప్పుడు 2010లో చెన్నై టైటిల్ సాధించగా ఈ దశాబ్ద ముగింపు టైటిల్ ముంబై సొంతం చేసుకుంది.
