ఈరోజుల్లో ఎటువంటి వ్యక్తి అయినా సరే ఎంత డబ్బు సంపాదించిన సరే కాసేపు సమయం లేకపోతే ఆ సంపాదనకు అర్ధమే లేకుండా పోతుంది. మనిషి సంపాదించేది వాళ్ళు సుఖంగా ఉండడానికే, ఇక అది క్రీడలకు కూడా బాగా చెప్పొచు. ప్రస్తుత రోజుల్లో ఆటకు ఎక్కువ సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో దానికి తగ్గటుగా విశ్రాంతి కూడా ఉండడం అంతే ముఖ్యమని చెప్పాలి. దీనంతటికి మూల కారణం డబ్బే అని చెప్పాలి. అది అలవాటు పడితే విశ్రాంతి గుర్తుకు రాదూ. ఇటీవలే టీమిండియా ఎడతెరుపు లేకుండా సిరీస్ లు ఆడుతూ వస్తుంది. ఈమేరకు వారికి విశ్రాంతి దొరకడం లేదని కోహ్లి, రాహుల్ చెప్పడం జరిగింది. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ దీనిపై స్పందించారు. అలా విశ్రాంతి లేకుండా ఉన్న సమయాల్లో ఇలాంటి ఐపీఎల్ కి దూరంగా ఉండాలని, కాని ఐపీఎల్ డబ్బు గ్లామర్ తో కలిపి ఉండడంతో దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. ఐపీఎల్ అనేది దేశం కోసం ఆడేది కాదని దేశం కోసం ఆడే మ్యాచ్ ల కోసం ఎంతైనా కష్టపడొచ్చని ఆయన అన్నారు. ఇది ముఖ్యంగా కోహ్లికి వర్తిస్తుందని అన్నారు.