తెలంగాణలోని కొమురం భీం జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. బెజ్జూరు జెడ్పీటీసీ పుష్పలత , ఎంపీటీసీ సాయన్న , ముగ్గురు సర్పంచులు, మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు పార్టీకి రాజీనామా చేశారు. రహదారులు, వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన చెందారు. 12 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నా పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆరోపించారు. తమ రాజీనామాను ఆమోదించాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కు ప్రజాప్రతినిధులు రాజీనామా లేఖ రాశారు.
