Breaking News
Home / SLIDER / నేడు కొంగరకలాన్ కు సీఎం కేసీఆర్

నేడు కొంగరకలాన్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత..ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ రోజు  గురువారం రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా  కొంగరకలాన్‌లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.

దీనికోసం ఆయన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుండి మధ్యాహ్నం 2 గంటలకు   కొంగరకలాన్‌కు చేరుకొంటారు. మొదట సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించి అనంతరం ముఖ్యమంత్రి  అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు.

అనంతరం కలెక్టరేట్‌ సమీపంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నిన్న బుధవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino