తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యవిద్యలో చరిత్ర సృష్టించారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 2014కు ముందు 67 ఏండ్ల కాలంలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. కానీ గత ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ కొత్తగా 16 వైద్య కళాశాలలు మంజూరు చేశారని వెల్లడించారు.
జిల్లాకు ఒకటి చొప్పున మరో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తికావొచ్చిందన్నారు. ఇక వనపర్తి, రామగుండం, జగిత్యాలలో వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. త్వరలో కొత్తగూడెం మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నామని వెల్లడించారు. కాగా, ప్రధాని మోదీ రాష్ట్రానికి ఎన్ని కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలని ట్విట్టర్ వేదిగా ప్రశ్నించారు.
Now let me tell you how many medical colleges our PM Modi Ji sanctioned to Telangana ? https://t.co/lxWqrtLk1u pic.twitter.com/Dyg6wA7bSH
— KTR (@KTRTRS) August 28, 2022