తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 52,460 పోస్టులకు రాష్ట్ర ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే.. ఇందులో 20,899 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఇటీవలే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన సంగతి కూడా మనకు తెల్సిందే ..ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇదే నెలలో గ్రూప్-4 పోస్టులకు సైతం ఆర్థికశాఖ అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
