Home / SLIDER / మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే..?

మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే..?

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో  గుభాళించేది గులాబీ జెండాయేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అక్కడ టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని చెప్పారు.

మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలం కొండూరు గ్రామ ఉప సర్పంచ్ పాలకుర్ల జంగయ్య గౌడ్, వార్డు సభ్యులు జహంగీర్, పగడాల రాములు, రాంబాబు, ఉడుగు శ్రీను శనివారం ఉదయం హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శరణ్యమన్నారు.కమలం పార్టీకీ తెలంగాణలో స్పేస్ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదని గల్లీలో రాదని ఎద్దేవా చేశారు. అందుకే గులాబీ పార్టీలోకి వలసలు కోనసాగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై పెరిగిన విశ్వసనీయతకు ఇది అద్దంపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చందంపేట మాజీ ఎంపీపీ గోవింద్, గ్రామ సర్పంచ్ కుంభం నర్సమ్మ మాధవ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉడుగు అంజయ్య అంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat