తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే నెలలో కేరళలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను కల్సి ఆహ్వానం పలికారు.జనవరి 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు.
