Home / NATIONAL / విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ఎందుకు దిగలేదంటే..?

విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ఎందుకు దిగలేదంటే..?

చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమవ్వగానే ప్రధానమంత్రి నరేందర్ మోదీ దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఎంత బాధపడ్డామో అందరికీ విదితమే. అయితే చంద్రయాన్2 ను ఇస్రో జులై 22,2019న నెల్లూరు శ్రీహారికోట నుంచి ప్రయోగించిన సంగతి తెల్సిందే. పీఎల్ఎస్వీ మార్క్ 3 రాకెట్ చంద్రయాన్ ను నింగిలోకి మోసుకొని దూసుకెళ్లింది.

ఈ క్రమంలో ఉన్న అన్ని దశలను దాటుకుని సెప్టెంబర్ 7న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిగే క్రమంలో తలెత్తిన సాంకేతికలోపం కారణంగా ఇంకా 500 మీట్లర్ల దూరంలో ఉండగానే భూమితో సంబంధాలు కోల్పోయి హార్డ్ గా ల్యాండింగ్ జరిగింది. ఇలా హార్డ్ ల్యాండింగ్ జరగడం వలన ల్యాండర్ విక్రమ్ దెబ్బతిన్నది.
మరో నిమిషంలో ల్యాండింగ్ జరగబోతుంది అనగా ఇలా పడిపోవడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆరాతీశారు.

ఈ క్రమంలో రఫ్ బ్రేకింగ్ నుంచి ఫైన్ బ్రేకింగ్ కు చేరుకునే సమయంలోనే అసలు సమస్య తలెత్తిందని తేలింది. సెకనుకు 146 మీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేశారు. కానీ విక్రమ్ సెకనుకు 750 మీటర్ల వేగంతో ప్రయాణం చేయడంతో అదుపుచేసే క్రమంలోనే.. అది చంద్రునిపై హార్డ్ గా ల్యాండ్ అయినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.