Home / BAKTHI / మనుషులే కాదు మూగజీవులు కూడా అయ్యప్ప ఫై భక్తిని తెలియజేసే వీడియో వైరల్

మనుషులే కాదు మూగజీవులు కూడా అయ్యప్ప ఫై భక్తిని తెలియజేసే వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుమల నుంచి మొదలైన అయ్యప్ప స్వాముల బృందానికి ఓ విచిత్రమైన ఘటన ఎదురైంది. కార్తీకమాసం లో కోట్లాదిమంది అయ్యప్ప మాల వేసుకొని స్వామివారిని దర్శించుకోవడం..అయ్యప్ప సేవలో ఉండిపోవడం చేస్తుంటారు. కేవలం మనుషులే కాదు మూగజీవులు కూడా అయ్యప్ప ఫై భక్తి ని తెలియజేస్తాయని తాజాగా బయటపడింది. అయ్యప్ప భక్తులతో కలిసి ఓ శునకం 480 కిలోమీటర్లు నడవడం ఇప్పుడు వైరల్ గా మారింది. తిరుమలలో అక్టోబర్‌ 31వ తేదీన 13 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు కాలినడకన బయల్దేరారు. వారితో పాటుగా నడక మొదలుపెట్టన శునకం మార్గం మధ్యలో వెళ్లిపోతుందేమో అనుకున్నారట. కానీ వాళ్లు నడుస్తున్నా కొద్ది ఆ కుక్క కూడా వారితో నడుస్తూనే ఉందట. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు మాట్లాడుతూ.. మేము మా యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు తాము 480 కిలోమీటర్లు నడిచామని.. వారితో పాటుగా ఆ కుక్క కూడా అన్ని కిలో మీటర్లు నడిచిందని తెలిపారు. తాము తెచ్చుకున్న ఆహారాన్ని ఆ కుక్కకు కూడా పెట్టామని చెప్పుకొచ్చారు. కుక్క ఇలా తన భక్తిని చాటుతూ అయ్యప్ప కోసం పాదయాత్ర చేయడం చూసి అంతా దేవుని దయ అంటూ భక్తులు అభిప్రాయపడుతున్నారు.