తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి పర్వదినం శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది . మరో రెండు రోజుల్లో దాదాపు లక్షా 70 వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు . 18వ తేదీన ఉదయం 1.30లకు వీఐపీలను, ఉదయం 5 గంటలకు సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు.. ఇక వీఐపీలు స్వయంగా వస్తేనే టిక్కేట్లు కేటాయింపు ఉంటుందని… కానీ, సిఫార్సు లేఖలు స్వీకరించబడవు అని స్పష్టం చేశారు. 17వ తేదీన జేఈవో కార్యాలయం మూసిఉంచుతామని తెలిపిన జేఈవో.. సర్వదర్శనం భక్తులు ముందుగా రావడంతో ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. క్యూలైనులో వేచివున్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తాంమని వెల్లడించారు.
