గురువారం నాడు మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఇది ఉదయం 8.03 గంటలకు ప్రారంభమయి 11.11 గంటలకు ముగిసింది. మూడు గంటలు పాటు కొనసాగిన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారత్ లోనే కాకుండా ఆసియాలో కొన్ని దేశాల్లో కనిపించింది. ఈ సందర్భంగా బుధవారం రాత్రినుండే దేవాలయాలు మూసివేసారు. కాగా గురువారం 12గంటల సమయంలో అభిషేకం చేసి పునఃప్రారంభించారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం నాడు ఒక అద్భుతం జరిగింది. అది ఏమిటంటే ఈ గ్రహణం సమయంలో నీటిలోని రోకలి నిలబడింది. ఇది విన్న ఎవరూ నమ్మరు కాని ఇది నిజమనే చెప్పాలి. ఎందుకంటే గ్రహణం సమయంలో ఒక ఇత్తడి పదార్ధంలో నీళ్ళు పోసి రోకలి పెడితే అది నిలబడుతుంది. మల్లా గ్రహణం అయిపోగానే రోకలి పడిపోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.